శేరిలింగంపల్లి: వేంకటేశ్వర నగర్ డివిజన్: జూలై 09 ( ప్రజావాణి పాపిరెడ్డి నగర్ కాలనీ లో జరిగిన ముఖ్యఅతిథిగా పాల్గొని 200 మంది మహిళ సోదరీమణులకు చీరలను మరియు దుప్పట్లను పంపిణీ చేసిన గౌరవ పి ఏ సి చైర్మన్ శ్రీఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా పి ఏ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చాముండేశ్వరీ అనుగ్రహ పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, ఆయన జన్మదినం పురస్కరించుకొని పలు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తన వంతు సేవలు అందించాలని, ఆ యొక్క సేవలో ప్రతిఫలం వచ్చే తరానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పి ఏ సి చైర్మన్ గాంధీ తెలియచేశారు .
ప్రస్తుత సమాజంలో సేవా కార్యక్రమాలకు ఎన్నో ధార్మిక సంఘాలు సహకారం అంది స్తున్నారు అటువంటి ధార్మిక కార్యక్రమాలను ఎన్నో సంవత్సరాలుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి సేవలందిస్తున్నారని వారి సేవలను భావితరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని కోరారు. బాలానగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో సివి రామన్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేంద్రవాడ వెంకటేశ్వర అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక ధోరణిలో ముందుకు వెళితే యువత తప్పు దోవ పట్టారని తెలిపారు
ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు,రాజ్యశ్రీ, పాపిరెడ్డి నగర్ బస్తి అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి, నాయకులు పోతుల రాజేందర్, చెర్ల సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి నర్సింహులు , తాటి కిరణ్, వనం ఆంజనేయులు, మాదాసు అనంత రాములు, సత్యనారాయణ, శ్రీకాంత్, లక్ష్మీ, అరుణ, సులోచన, మనమ్మ తదితరులు పాల్గొన్నారు.




