గ్రామ సచివాలయ మహిళా పోలీస్ నిర్లక్ష్యం – ప్రజల సమస్యలను పట్టించుకోని వైనం – చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.
గ్రామ ప్రజల ఆవేదన (జూన్ 02 ప్రజావాణి) పోరుమామిళ్ల మండలం పుల్లవీడు గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ [ సుభాషిణి ‘మహిళా పోలీస్’] తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు,పిల్లల రక్షణకు మరియు శాంతిభద్రతల పరిరక్షణకు వారధిగా నిలవాల్సిన సదరు మహిళా పోలీస్, స్థానికంగా జరుగుతున్న ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకోవడం లేదు.గ్రామంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు,గృహ హింస మరియు అసాంఘిక కార్యకలాపాలపై (బెల్ట్ షాపులు వంటివి) గ్రామస్థులు పలుమార్లు ఆమె దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదు.ప్రజల సమస్యల పట్ల కనీస బాధ్యత లేకుండా,తాము వ్యవహరిస్తూ,నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ,జీతాలు తీసుకుంటూ విధులకు మాత్రం ఎగనామం పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థుల డిమాండ్:ప్రజలకు అందుబాటులో ఉండకుండా,స్వప్రాయోజనాల కోసమే అన్నట్లు వ్యవహరిస్తున్న,గ్రామస్థాయిలో మహిళల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం నియమించిన గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్) విధి నిర్వహణ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.గ్రామాల్లో మహిళల సమస్యలు,గొడవలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం. సచివాలయ సిబ్బందితో గానీ,గ్రామ పెద్దలతో గానీ సమన్వయం లేకపోవడం.ఉన్నతాధికారులు స్పందించాలి:రక్షణ కల్పించాల్సిన మహిళా పోలీసే ఈ విధంగా గ్రామ విషయాలను గాలికొదిలేయడంపై మహిళా సంఘాలు మరియు గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీతాలు తీసుకుంటూ విధులను విస్మరిస్తున్న ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
RELATED ARTICLES




