📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బెజ్జంకి మండలానికి అరుదైన గౌరవం...గూడెం గ్రామానికి చెందిన బోనాల అనిల్‌కు పీహెచ్‌డీ

బెజ్జంకి మండలానికి అరుదైన గౌరవం…గూడెం గ్రామానికి చెందిన బోనాల అనిల్‌కు పీహెచ్‌డీ

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూలై 23 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన బోనాల మొండయ్య–ఎల్లవ్వ దంపతుల కుమారుడు బోనాల అనిల్ శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ వైవా-వోసేను విజయవంతంగా పూర్తి చేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D .) డిగ్రీకి అర్హత సాధించారు.
శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి డా. డి. హరికాంత్ పర్యవేక్షణలో అనిల్ “పెర్ఫార్మన్స్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ తెలంగాణ – ఏ కంపేరటివ్ స్టడీ ” అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. తెలంగాణలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్థిక, నిర్వహణ, సేవా పనితీరును తులనాత్మకంగా విశ్లేషిస్తూ ఆయన పరిశోధన నిర్వహించారు.విశ్వవిద్యాలయ పరీక్షల శాఖ ఆధ్వర్యంలో, పరీక్షల నియంత్రణాధికారి డా. సురేష్ కుమార్ పర్యవేక్షణలో వైవా-వోసే నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కె. జయచంద్ర రెడ్డి బాహ్య పరీక్షకుడిగా హాజరై పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించి పలు ప్రశ్నలు అడిగారు. అనిల్ తన పరిశోధన ఫలితాలు, విశ్లేషణలు, సూచనలను సమర్థవంతంగా వివరించి వైవాను విజయవంతంగా పూర్తి చేశారు.ప్రస్తుతం బోనాల అనిల్ యూనివర్సిటీ పీజీ కళాశాల, గోదావరిఖని వాణిజ్యశాస్త్ర విభాగంలో పార్ట్‌టైమ్ అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు. సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీరంగ ప్రసాద్, పరిశోధన పర్యవేక్షకులు డా. డి. హరికాంత్, వాణిజ్యశాస్త్ర విభాగ అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు ఆయనను అభినందించారు.
గూడెం గ్రామానికి చెందిన అనిల్ పీహెచ్‌డీ సాధించడం గ్రామానికి గర్వకారణమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి,ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్‌డీ స్థాయికి ఎదిగిన అనిల్ గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్తులో విద్యా, బోధన, పరిశోధన రంగాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular