📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialజైపూర్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

జైపూర్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

📰 Generate e-Paper Clip

ఐదుగురు అరెస్ట్, రూ.21,450 నగదు స్వాధీనం

జైపూర్,జూలై23,ప్రజావాణి:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు పేకాట రాయుళ్లపై ఉక్కుపాదం మోపారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఒక పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ (నార్కోటిక్) బృందం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం… రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో టేకుమట్ల గ్రామంలో కొందరు వ్యక్తులు డబ్బులు పందెంగా కాసి ‘మూడు ముక్కల’ పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సదరు స్థావరంపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21,450 నగదు, 52 పేకముక్కలతో పాటు 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జైపూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular