పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపుపై ప్రత్యేక దృష్టి.
జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా, ధ్యాన సాధనల్లో పాల్గొన్న ఎస్పీ.
ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే సమాజానికి ఉత్తమ సేవలు అందించగలరు” అని ఎస్పీ సూచన.
జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్య సూత్రాలను అలవర్చుకోవాలని పిలుపు.
తిరుపతి జిల్లా జూన్ 5 ప్రజావాణి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన “హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్” కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు పాల్గొన్నారు. పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ మరియు విధి నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు యోగా మరియు ధ్యాన సాధనల్లో స్వయంగా పాల్గొని సిబ్బందికి ప్రేరణనిచ్చారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, పోలీసు శాఖలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ప్రజా సేవలో నిమగ్నమై ఉంటారని, విధి నిర్వహణలో బిజీగా ఉండటం వల్ల చాలామంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అత్యంత విలువైన సంపద అని, ముఖ్యంగా ఎక్కువ సమయం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యవసరమని ఎస్పీ గారు తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని సూచించారు.
భారతదేశానికి ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వాల్లో యోగ ఒకటని పేర్కొన్న ఎస్పీ గారు, యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని చెప్పారు. యోగా సాధన అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో సహాయపడటమే కాకుండా, సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తుందని వివరించారు.
“డిపార్ట్మెంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, యోగా మరియు ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చలాకీగా ఉన్నప్పుడే మనం సమాజానికి మరింత సమర్థవంతమైన సేవలు అందించగలం. మీ ఆరోగ్యం బాగుంటేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది” అని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.
అంతేకాకుండా, తిరుపతి జిల్లాతో పాటు శ్రీకాళహస్తి సహా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా సూత్రాలను నేర్చుకుని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా, ధ్యాన సాధనలను ఆచరించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
అదనపు ఎస్పీలు శ్రీ వెంకట రావు గారు పరిపాలన శ్రీ రవి మనోహరచారి శాంతి భద్రతలు శ్రీ శ్రీనివాసులు క్రైమ్స్ శ్రీ శ్రీనివాస రావు మరియు సబ్ డివిజన్ డీఎస్పీలు సిబ్బంది హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారు పాల్గొన్నారు




