📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetసిద్దిపేటలో రోడ్డు ప్రమాదం – క్షతగాత్రుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం – క్షతగాత్రుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం – క్షతగాత్రుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..

సిద్దిపేట, జూన్ 18, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న చిట్యాల గ్రామానికి చెందిన వడ్ల ప్రకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, కానిస్టేబుల్ మహేష్‌లు తక్షణమే స్పందించారు. పోలీసుల సహాయంతో అతడిని సురక్షితంగా 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమయస్ఫూర్తితో వ్యవహరించి, క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, కానిస్టేబుల్ మహేష్‌లను ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. “ఆపదలో ఉన్నవారిని కాపాడటంలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని” ఈ ఘటన ద్వారా వారు మరోసారి నిరూపించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular