ఉద్యమ కారులకు న్యాయం కోసం మరియూ దుబ్బాక బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రొఫెసర్ కోదండరాం ను కలిసిన..
తెలంగాణ జనసమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి
సిద్దిపేట్, జూన్ 18, ప్రజావాణి
హైదరాబాదులో ప్రొఫెసర్ కోదాడరామ్, నివాసం దగ్గర కలిసి వివిధ విషయాలు మాట్లాడారు విధంగా జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం నిరంతరం పోరాటం చేసిన వారికిన్యాయం జరగాలి అని అన్నారు. అదే విధంగా ఉద్యమ కారుల గుర్తింపు విషయం లో కుటుంబం బారం ఇబ్బంది ఉన్న కూడా స్వరాష్ట్రం కోసం పోరాటం కోసం పోరాటం చేసిన వారికి అదే విధంగా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం లేని వారికి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి అని అన్నారు అదే విధంగా జిల్లా యువజన అధ్యక్షుడు కీసరీ స్వామి మాట్లాడుతూ దుబ్బాకాలొ బీసీ బాయ్స్ హాస్టల్ నూతన భవనం లేక అద్దె భవనము లో కొనసాగుతున్నారు. అని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుక పోయి నూతన భవనం కోసం కృషి చేస్తే బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అదే విధంగా దుబ్బాక ప్రాతం కూడా అభివృద్ధి జరుగుతుంది. అని అన్నారు అంతే కాకుండా హాస్టల్ భవనం సరిగ్గా లేకపోవడం తో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. వెంటనే కోదండరాం,
తప్ప కుండా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.




