ప్రజావాణి శాయంపేట
మండలంలో నిర్వహించిన సర్పంచులతో మండల సమన్వయ, సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో తాగునీటి సరఫరా, రహదారులు, మహిళా సంఘాల భవనాలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను గుర్తించిప్రాధాన్యతఆధారంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అలాగే రైతులు, ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధిని వేగవంతం చేయాలని ఎమ్మెల్యేకోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ మండల పార్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలో సర్పంచులతో మండల సమన్వయ, సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
RELATED ARTICLES




