సావిశెట్టిపల్లెలో సుడిగాలి పర్యటన చేసిన టీడీపీ నేతలు: కార్యకర్తల్లో నిండిన సరికొత్త ఉత్సాహం

కాశినాయన జూలై 19 ప్రజావాణి మండల పరిధిలోని సావిశెట్టిపల్లె గ్రామంలో ఆదివారం నాడు పండుగ వాతావరణం సంతరించుకుంది.గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని,తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఆర్.సూర్యనారాయణ రెడ్డి,కాశినాయన మండల సీనియర్ టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డితో కలిసి సావిశెట్టిపల్లె గ్రామంలో విస్తృతంగా సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, గ్రామస్థులు దేవాలయ ఉత్సవాల సందర్భంగా గ్రామానికి విచ్చేసిన సూర్యనారాయణ రెడ్డి,కర్నాటి వెంకటరెడ్డిలకు గ్రామ సరిహద్దుల్లో తెలుగుదేశం...