📄 ePaper
Friday, June 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సమగ్ర శిక్షణలో ఉపాధ్యాయుల ఆకలి కేకలు

సమగ్ర శిక్షణలో ఉపాధ్యాయుల ఆకలి కేకలు

📰 Generate e-Paper Clip

అన్నమయ్య జిల్లా జూన్ 5 ప్రజావాణి రాయచోటి మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సమగ్ర శిక్షణ ఆధ్యర్యం లో జరుగుతున్న F.L.N ఉపాధ్యాయ శిక్షణ 6 DAYS ( 04-06-2026 TO 09-06-2026 ) కార్యక్రమంలో భోజనం, తాగునీటి కోసం ఉపాధ్యాయుల అవస్థలు అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మాసాపేటలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం సమస్యలకు నిలయంగా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శిక్షణలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా,వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 6 ట్రైనింగ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది కడప జిల్లా 7 సెంటర్లు భారతి ఎంట్రప్రెస్స్ ఒక్కరికే అప్పచెప్పడం వళ్ళ సరైన భోజన,వసతి సదుపాయాలు కల్పించకపోవడం తో ఈ గంగరగోళానికి దారితీయడం జరిగిందిశిక్షణ కార్యక్రమం మొదటి రోజునే ఉదయం టీ,స్నాక్స్ ఏర్పాటు చేయకుండా శిక్షణను కొనసాగించడం ఉపాధ్యాయుల్లో అసంతృప్తికి కారణమైంది. అనంతరం మధ్యాహ్న భోజన సమయానికి కూడా తీవ్ర గందరగోళం నెలకొంది.600 మందికి పైగా హాజరైన ఉపాధ్యాయులకు కేవలం 350 మందికి మాత్రమే సరిపడే భోజనం సిద్ధం చేయడంతో వందలాది మంది ఉపాధ్యాయులు భోజనం లేక ఇబ్బందులు పడ్డారు.శిక్షణ రెండో రోజు అదే పరిస్థితి కొనసాగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.భోజనం సరిపోకపోవడంపై ఉపాధ్యాయులు ప్రశ్నించగా,భోజన సరఫరా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా, “మీకు దిక్కున్న చోట చెప్పుకోండి” అంటూ అసభ్యంగా స్పందించారని పలువురు ఆరోపించారు. ఈ వ్యవహారం ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.ఇదిలా ఉండగా శిక్షణా కేంద్రంలో తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో సరిపడా మంచినీరు అందుబాటులో లేకపోవడం వల్ల పలువురు ఉపాధ్యాయులు అలసటకు గురయ్యారని సమాచారం.కొందరు స్వయంగా బయట నుంచి నీటి బాటిళ్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.భోజనం అందని ఉపాధ్యాయులు గంటల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో శిక్షణా కార్యక్రమంపై అసంతృప్తి మరింత పెరిగింది.అయితే ఈ పరిస్థితిని జిల్లా విద్యాశాఖ అధికారులు,ఉన్నత విద్యా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఒక్కక్కరికి టిఫన్,భోజనము మరియు స్నాక్స్ కు 300 రూపాయలు,స్టేషనరీ కి 100 రూపాయలు కేటాయించగా,భారతి ఎంట్రప్రెస్స్ వారు ఇతరులకు అనగా సబ్ క్రాంట్రాక్టు లకు కేవలం 140 రూపాయలకే ఇవ్వడం వాళ్ళ నాసిరకమైన భోజన మరియు వసతి ఏర్పాటు చేయడం జరిగిందిగతంలో ఇదే తరహా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదని, ఈసారి శిక్షణా కేంద్రాన్ని మార్చడం,అనుభవం లేని లేదా పైరవీల ద్వారా కాంట్రాక్టు పొందిన వారికి భోజన సరఫరా బాధ్యతలు అప్పగించడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.ఈ విషయం మీద ఏమి చేయలేక MEOS మరియు DEOS ఇతర విద్యాశాఖ అధికారులు చేతులెత్తేయడం జరిగిందిఉపాధ్యాయుల శిక్షణ వంటి కీలక కార్యక్రమాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమని,బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అలాగే శిక్షణకు హాజరయ్యే ప్రతి ఉపాధ్యాయుడికి తగిన భోజనం తాగునీరు సౌకర్యాలు కల్పించేలా విద్యాశాఖ వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular