📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyషాద్‌నగర్‌లో నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం

షాద్‌నగర్‌లో నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం

📰 Generate e-Paper Clip

*షాద్‌నగర్‌లో నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం..*

*లాల్ సింగ్ తండాలో 22 కిలోలు పట్టివేత*

*పాత్లావత్ కవిత ఇంట్లో తనిఖీలు – లభ్యం*

*పరారీలో ఉన్న పాత ఆగిర్యాలకు చెందిన రాజేశ్వరి ప్రధాన సూత్రధారి*

రంగారెడ్డి జిల్లా
షాద్‌నగర్//
నియోజకవర్గం
(ప్రజా వాణి )

ఫరూక్‌నగర్ మండలం లాల్‌సింగ్ తండాలో
పోలీసులు, ఎస్వోటీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు లాల్‌సింగ్ తండాలోని పాత్లావత్ కవిత ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 22 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు లభించినట్లు అధికారులు తెలిపారు. చౌదరిగూడ వ్యవసాయ శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, షాద్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విత్తనాలను కొందుర్గు మండలం పాత ఆగిర్యాల గ్రామానికి చెందిన రాజేశ్వరి కవిత వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్‌నగర్ సీఐ సీతారాం మీడియాకు వెల్లడించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular