📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ సత్య సాయి జిల్లాలో 125 మంది జర్నలిస్టులకు రెండవ విడతగా అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం

శ్రీ సత్య సాయి జిల్లాలో 125 మంది జర్నలిస్టులకు రెండవ విడతగా అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం

📰 Generate e-Paper Clip

శ్రీ .

మరో 3 నెలల్లో మూడో విడత అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ

ప్రజలకు, ప్రభుత్వానికి పాత్రికేయులు వారిదిగా పనిచేయాలి.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీడియా ద్వారా ప్రచారం చేయాలి.

డిఆర్ఓ కొండయ్య


అనంత పురం బ్యూరో జూలై 22 మన ప్రజా వాణి
శ్రీ సత్య సాయి జిల్లాలో అర్హులైన 125  మంది జర్నలిస్టులకు రెండవ విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందని డిఆర్ఓ కొండయ్య తెలిపారు.బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు డిఆర్ఓ కొండయ్య అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా డిఆర్ఓ కొండయ్య మాట్లాడుతూ…* అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ జీవో నం 84 నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.మొదటి  సమావేశంలో 125  కి కమిటీ ఆమోదం తెలిపిందనన్నారు. ఇంకనూ అర్హత ఉన్న పాత్రికేయులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి మరియు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి మూడవ సమావేశం లో అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని   తెలిపారు. అలాగే ప్రస్తుతం 2026 –  27 సంవత్సరానికి   మంజూరు కాబడిన సదరు దరఖాస్తులను డియంఎసి సభ్యులు సమన్వయ సహకారాలతో అక్రిడేషన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని డిఆర్ఓ సూచించారు. ముఖ్యంగా పాత్రికేయులు సమాజానికి ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న  పథకాలను ప్రజలకు చేరువుగా తీసుకెళ్లే విధంగా సమాచార శాఖతో పాటు పాత్రికేయులు కృషి చేయాలన్నారు.జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రజలు పాత్రికేయులు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాత్రికేయ రంగం ద్వారా సమాజానికి విలువైన సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి టి. భరత్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ ఏఈఐఈ రామాంజనేయులు , ఏపీఎస్ఆర్టీసీ నుండి ఉషారాణి, భాస్కర్ డిఎమ్&హెచ్ఓ నుండి డాక్టర్ సునీల్ సాగర్, జిల్లా అక్రిడిడేషన్ కమిటీ సభ్యులు సీనియర్ పాత్రికేయులు పుల్లయ్య, చక్రపాణి, కెవి సుబ్బయ్య,శంకరప్ప, శివకుమార్ ,గోవర్ధన్ రెడ్డి, శివరామకృష్ణ, వెంకటరమణప్ప, శివప్ప,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular