📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
HomeతెలంగాణNizamabadశ్రీ వేద హైస్కూల్ లో ఘనంగా బోనాల సంబరాలు.

శ్రీ వేద హైస్కూల్ లో ఘనంగా బోనాల సంబరాలు.

📰 Generate e-Paper Clip

శ్రీ వేద హైస్కూల్ లో ఘనంగా బోనాల సంబరాలు.

డీజే చప్పుళ్ల మధ్య కోటగిరిలో బోనాల ఊరేగింపు.

సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహనకు బోనాల వేడుకలు.

కోటగిరి/ప్రజావాణి:-సంస్కృతి,సంప్రదాయాలను చిన్నారు లకు తెలియజేసేందుకు శ్రీ వేద హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను ఎత్తుకొని ఆలయానికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా చిన్నారులు పోతురాజు వేషధారణలు ధరించి,డీజే చప్పుళ్లకు అను గుణంగా నృత్యాలు చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.బోనాల పండుగ వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి.పండుగల యొక్క విశిష్టత, ఆచారాలను విద్యార్థులకు తెలియజేసేందుకే ఈ కార్య క్రమాన్ని నిర్వహించామని,ఇలాంటి సాంస్కృతిక కార్యక్ర మాల ద్వారా విద్యార్థుల్లో భక్తి భావం,క్రమశిక్షణ పెంపొందు తుందని పాఠశాల కరస్పాండెంట్ తేల్ల అక్షర,డైరెక్టర్ తేల్ల రవి కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రేష్మ,నఫీజ్,సాయి,పవన్,సాయినాథ్,భీమ్రావు, చంద్రకళ,సంగీత,సుప్రియ,పూజా,రమ,సంగీత,సునీత,శిరీష,నాగరాజు,రాము,విద్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular