ప్రజా సేవకే నిదర్శనంగా నిలిచిన నాయకత్వం- మంత్రి సీతక్క
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
ములుగు
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు డాక్టర్ సీతక్క. పదవి కోసం ప్రజలను వెతకని నాయకురాలు, ప్రజల కోసం పదవినే సేవగా మార్చుకున్న వ్యక్తిత్వం ఆమెది.
అడవుల ఆత్మగా, ఆదివాసీల ఆత్మీయతగా, రైతన్న చెమటకు విలువ తెలిసిన నాయకత్వంగా సీతక్క గుర్తింపు పొందారు. అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి అండగా నిలిచి, సబ్బండ వర్గాల అభివృద్ధికే ఆమె కృషి చేస్తున్నారు.
ఆమె మాటల్లో నమ్మకం, చేతల్లో సేవ, అడుగుల్లో సమానత్వం కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. కన్నీటి బాటలో నడిచిన జీవితాలకు ఆశల దీపమై ఆమె నిలిచారు.
పాలనలో మానవత్వం, ప్రవర్తనలో వినయం ఆమె ప్రత్యేకత. ఆమె నవ్వు ధైర్యాన్ని, మాట భరోసాను కలిగిస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు.
అందుకే ప్రతి పల్లె “మా డాక్టర్ సీతక్క కావాలి” అంటోంది. సబ్బండ వర్గాలు ఆమెతోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నాయి.
ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచే నాయకురాలుగా డాక్టర్ సీతక్క పేరు మారుమోగుతోంది.



