వీరాపూర్‌లో పోలీస్ కళాభృందంచే అవగాహన రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు సూచనలు

  బెజ్జంకి, జూలై 27 (ప్రజావాణి) సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం,నేరాల నివారణకు అవసరమైన జాగ్రత్తలను తెలియజేయడం లక్ష్యంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ గ్రామంలో పోలీస్ కళాభృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి బెజ్జంకి ఎస్సై తిరుపతి హాజరై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని,తెలుపుతూ,అలాగే ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల...