📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వివేకానంద సేవాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

వివేకానంద సేవాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

📰 Generate e-Paper Clip

వివేకానంద సేవాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ప్రజావాణి న్యూస్(మార్చి30)కాసినాయన మండలం ఓబులాపురం గ్రామ సమీపంలోని సగిలేరు ఒడ్డున ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సోమవారం కవలకుంట్ల లూర్దయ్య, ధర్మపత్ని సంతోషమ్మ, కుటుంబ సభ్యులు అవ్వతాతలకు భోజనం ఏర్పాటు చేశారు.వివేకానంద సేవాశ్రమంలో 35 మందికి అనాధలకు విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కవలకుంట్ల లూర్ధయ్య,వారి కుటుంబ సభ్యులు అవ్వతతలకు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.అన్నదాత సుఖీభవ దయచేసి ఆశ్రమాన్ని సందర్శించండి నచ్చితే సహాయం చేయండి అన్నం పరబ్రహ్మస్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఫ్రెండ్స్ ప్రస్తుతం మన వివేకానంద సేవ శ్రమంలో మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో మతిస్థితి కోల్పోయిన 30 మంది అభాగ్యులు ఉన్నారు,స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని రామకృష్ణ రెడ్డి దంపతులు అవ్వ తాతల కోసం మంచి ఆహ్లాదకరమైన ఆశ్రమాన్ని నిర్మించి వారిని కన్న బిడ్డలు లాగా పోషిస్తూ ఉండటం అభినందనీయమన్నారు.ఇలాంటి సేవా గుణం కలిగిన వ్యక్తులను ఎంతగానో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కవలకుంట్ల లూర్ధయ్య,వారి సతీమణి కవలకుంట్ల సంతోషమ్మ, వారి కుమారులు: జయచంద్ర,బుజ్జి బాబు, మధుబాబు,కోడలు:అరుణ, రాణి,సునీత,కుమార్తెలు:వేళాంగిణి,మరియమ్మ,సౌజన్య,మనమల్లు మనవరాలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular