విద్యుత్ కోతలు ఉండొద్దు షాద్న గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఇన్స్టాలేషన్ పనుల పరిశీలన
విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక నేతలతో కలిసి పర్యటన
శ్రీరంగాపూర్ సబ్ స్టేషన్ ను సందర్శించిన ఎమ్మెల్యే
వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యుత్ శాఖ డీఈ శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక విద్యుత్ శాఖ అధికారులతో పాటు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ స్థానిక నేత సయ్యద్ సాదిక్, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి,
యువనేత కేకే కృష్ణ, స్థానిక సర్పంచ్ రమేష్, మాజీ వైస్ ఎంపీపీ మంగులాల్ నాయక్, గోవర్ధన్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ సబ్స్టేషన్ పరిధిలో కరెంట్ సరఫరా లో అంతరాయాలు లేకుండా ఓవర్ లోడ్ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇటీవలే విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ను కలుసుకొని సమస్యలు వివరించగా కొత్తగా 50 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లు
మంజూరు అయ్యాయని ఇందులో భాగంగానే శ్రీరంగాపూర్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ప్రజలనుండి ఇలాంటి ఫిర్యాదులు రాకూడదని నాణ్యమైన విద్యుత్తును అందించాలని డి శ్యాంసుందర్ రెడ్డిని ఎమ్మెల్యే శంకర్ ఆదేశించారు. స్థానిక నేతలు కూడా ఈ వేసవిలో విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని అన్ని రంగాలకు విద్యుత్ సరఫరా నాణ్యతగా సరఫరా చేయాలని సూచించారు. వేసవిలో ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. వేసవి వినియోగం ఒక్కసారిగా పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఆయా ట్రాన్స్‌ఫారాల వద్దకు అప్పటికప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు తరలించి విద్యుత్ సరఫరా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యుత్ నియంత్రికల సామర్థ్యం పెంచడంతో పాటు ఇప్పటికే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లకు మరమ్మతులు చేపడుతున్నారనీ వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న లైన్లలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు చేశామని.. లో వోల్టేజీ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తో పాటు పలువు నాయకులను స్థానికులు సన్మానించారు..

