📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyకోట్ల గొంతులను ఏకం చేసింది గులాబీ జెండా తెలంగాణ గడ్డ ఉన్నంతవరకు ఇక్కడి ప్రజలు...

కోట్ల గొంతులను ఏకం చేసింది గులాబీ జెండా తెలంగాణ గడ్డ ఉన్నంతవరకు ఇక్కడి ప్రజలు కేసీఆర్ ను మర్చిపోరు స్వరాష్ట్రాన్ని సాధించే వరకు గులాబీ జెండాతో కేసీఆర్ వెనుకడుగు వేయలేదు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

📰 Generate e-Paper Clip

కోట్ల గొంతులను ఏకం చేసింది గులాబీ జెండా

తెలంగాణ గడ్డ ఉన్నంతవరకు ఇక్కడి ప్రజలు కేసీఆర్ ను మర్చిపోరు

స్వరాష్ట్రాన్ని సాధించే వరకు గులాబీ జెండాతో కేసీఆర్ వెనుకడుగు వేయలేదు

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పార్టీ జెండాను ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కోట్లాది గొంతులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంతవరకు విశ్రమించకుండా ఉద్యమం చేపట్టిన గొప్ప పార్టీ గులాబీ పార్టీ అని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రాన్ని సాధించేంతవరకు విశ్రమించలేదని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు. నాటి సీమాంధ్ర కుట్రలకు, పాలకుల పనితీరుతో తెలంగాణ ప్రజలు హరిగోసపడుతున్న తీరును చూసి చలించి పోయిన కేసీఆర్ స్వరాష్ట్ర సాధన తోనే తెలంగాణ ప్రజలు బాగుపడతారని భావించి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పార్టీ ఏర్పాటు నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం, భద్రత, ఉద్యోగాలు, ఉపాధి, నీళ్లు, నిధులు వంటి అంశాలపై రాజిలేని పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సకలజనులను ఏకం చేసి ఉద్యమంలో భాగస్వాములను చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ఉధృతంగా నడపడంతో పాటు, రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని అభిప్రాయపడ్డారు. నాటికి నేటికి గులాబీ పార్టీ లక్ష్యం తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే భావనతో పని చేస్తుందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ను మాత్రం ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని చెప్పారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజా సంక్షేమాలు, అభివృద్ధి ఫలాలు మనందరికీ అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గులాబీ పార్టీలో పనిచేస్తున్నందుకు మనమందరం గర్వపడాలని, పార్టీలో ప్రతీ కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు తో పాటు గౌరవం కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సహకార కార్పోరేషన్ చైర్మన్ రాజవరప్రసాద్, మాజీ ఎస్సీ ఎస్టీ కమీషన్ మెంబర్ రాంబాల్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, ఆకుల శ్రీశైలం, చేగూరి వేణుగోపాల్, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, పార్టీ అధ్యక్షులు నటరాజన్, లక్ష్మణ్ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనరసింహా రెడ్డి, మాజీ పీఎసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular