📄 ePaper
Saturday, April 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.డాక్టర్ జి.రాజేష్ కుమార్

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.డాక్టర్ జి.రాజేష్ కుమార్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16)బద్వేల్ మండలము తొట్టిగారి పల్లె వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.డాక్టర్ జి.రాజేష్ కుమార్ మెడికల్ ఆఫీసర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.బద్వేల్ మండలము తొట్టిగారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వనంపుల సచివాలయం పరిధిలోని నంది పల్లె నందు చంద్రన్న చికిత్స కార్యక్రమంలో డాక్టర్ జి.రాజేష్ కుమార్ పాల్గొని వడదెబ్బను గురించి ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వడం అయినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ రైతులు,ఉపాధి కూలీలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రతి అంగన్వాడి సెంటర్ విలేజ్ హెల్త్ క్లినిక్ నందు ఆశా కార్యకర్తల వద్ద ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఓ.ఆర్ యస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడమైనది ప్రజలందరూ కూడా ఈ గమనించి ఉదయంనే బయటి పనులన్నీ ముగించుకొని 10 గంటలకు అంతా ఇంటికి చేరవలనని వడదెబ్బకు గురికాకుండా చూసుకుంటారని ప్రజలకు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియువి.జనార్దన్ రావు హెల్త్ అసిస్టెంట్ సంయుక్తంగా పాల్గొని వడదెబ్బ పైన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల యొక్క ప్రాముఖ్యతను గురించి వడ దెబ్బకు తీసుకొనవలసిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించడమైనది. అనంతరము ప్రజలకు వడదెబ్బ యొక్క పాంప్లెట్స, ఓ ఆర్ ఎస్ పంపిణీ చేయడం అయినది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు,చిన్నపిల్లలు తల్లులు,వృద్ధులు వేసవి కాలములో చాలా జాగ్రత్తగా ఉండి తమరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని వడదెబ్బకు గురికాకుండా చూసుకుంటారని తెలియజేయడమైనది.తీవ్రమైనటువంటి నీరసము అతి దాహము ఉన్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు తొందర్లో 108 వాహనం ఉపయోగించుకొని వచ్చి వైద్యం చేపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనిపేర్కొనడమైనది ఈ కార్యక్రమంలో విలేజి హెల్త్ క్లినిక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జోష్ణ ఏఎన్ఎం పి నాగమ్మ రాములమ్మ ఆశా కార్యకర్తలు లక్ష్మీదేవి, రుక్మిణమ్మ మరియు 104 సిబ్బంది పాల్గొనడం అయినది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular