కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) బద్వేల్ పురపాలక సంఘం మున్సిపల్ కార్యాలయం, బద్వేల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా,జలధార జల హారతి కార్యక్రమంపై బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించబడింది.ఈ నెల కార్యక్రమ ఇతివృత్తం జలధార జల హారతి.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల రీఛార్జ్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలి. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్.సచివాలయ కార్యదర్శులకు మరియు సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.ముఖ్య అంశాలు.నీటి సంరక్షణ వార్డుల్లోని చెరువులు, కుంటలను శుభ్రం చేసి నీటి వనరులను కాపాడుకోవాలి.పూడికతీ.తవర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో పూడికతీత పనులు యుద్ధప్రతిపాదికన చేపట్టాలి.ఇంకుడు గుంతలు: భూగర్భ జలాల పెంపు కోసం సోక్ పిట్స్ (ఇంకుడు గుంతలు) నిర్వహణపై దృష్టి సారించాలి.పరిశుభ్రత పాఠశాలలు,పార్కులు, బస్టాండ్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలి.లక్ష్యం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్ ర్యాంక్ మన బద్వేల్ మున్సిపాలిటీని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 5-స్టార్ రేటింగ్ దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమీషనర్.పిలుపునిచ్చారు.ప్రజలకు విన్నపం:మన వార్డు, మన బాధ్యత! రేపు జరిగే ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు,యువత మరియు నివాసితులందరూ పాల్గొని జల సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.కమీషనర్, .🌹
జలధార – జల హారతి”: రేపే “స్వచ్ఛ ఆంధ్ర డే” – సన్నద్ధతపై సమీక్షా సమావేశం
0
4
- Advertisment -




