కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) బద్వేలు పట్టణం,సత్య టౌన్‌షిప్‌లోని ఒక ప్లాటుకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, ఆక్రమణకు పాల్పడిన కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.బద్వేలు U/G పోలీస్ స్టేషన్ Cr.No. 56/2026 U/s 318(4), 338, 329(3), 324(4) r/w 3(5) BNSముద్దాయిల వివరాలు:1. A1:బొగ్గవరపు ఓబులేషు (34 సం.),శంఖవరం గ్రామం,కలసపాడు మండలం.2. A2:పగిడి బాలరాజు (42 సం.),శంఖవరం గ్రామం,కలసపాడు మండలం.నేరం మరియు అరెస్ట్:ఫిర్యాదుదారుడు చెరుకూరి శ్రీహరి విదేశాల్లో (మలేషియా) ఉండటాన్ని ఆసరాగా చేసుకుని,A-1 అతని కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని తిరుపతిలోని శ్రీహరి అక్క నివాసం నుండి ప్లాట్ నెం. 422 (సత్య టౌన్‌షిప్,బద్వేల్) కు సంబంధించిన అసలు పత్రాలను దొంగిలించాడు. అనంతరం A-2 మరియు ఇంకా కొంత మంది కలిసి, చనిపోయిన శ్రీహరి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి 2017 నాటి నకిలీ సేల్ అగ్రిమెంట్లు సృష్టించారు. తద్వారా ఆస్తిని అక్రమంగా విక్రయించి రూ.12 లక్షలు పొంది నిందితులు పంచుకున్నారు. నిందితులు స్థలంలో ఉన్న బేస్‌మెంట్‌ను కూడా ధ్వంసం చేసి అక్రమంగా ప్రవేశించారు.ఈరోజు దినము 17.04.2026 ఉదయము 8.30 AM గంటలకు అబ్బుషాహెబ్ పేట క్రాస్ రోడ్ వద్ద నిందితులను ఎస్.ఐ. T.V.N.చిరంజీవి మరియు సిబ్బంది పై ముద్దాయిలను అరెస్ట్ చేసి గౌరవనీయ బద్వేలు కోర్టులో హాజరు పరుచగా , నిందితులకి మేజిస్ట్రేట్ జ్యుడీషియల్ రిమాండ్ విధించడం జరిగింది.
ఫోర్జరీ పత్రాలతో ఆస్తి మోసం – ఇద్దరు నిందితుల అరెస్ట్ మరియు రిమాండ్ .
0
8
- Advertisment -




