📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా,ప్రజావాణి న్యూస్(ఏప్రిల్17) విజయవాడ రూరల్,కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం గారితో కలిసి,ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుక్రవారం రైతులకు డివిడెండ్లు పంపిణీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 287 మంది రైతులకు రూ.25,67,462లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ రైతులకు సొసైటీల నుంచి ఎరువులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు కొంత ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుందన్నారు. సొసైటీ సభ్యులకు డివిడెంట్స్ పంపిణీ చేసిన పి.ఏ.సి.ఎస్ చైర్మన్ ధూళిపాళ్ళ రమేష్ని, డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ),తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular