- రైలు కింద పడి దంపతుల బలవన్మరణం: అనాథలైన పసిపిల్లలు

చెన్నారావుపేట జూలై 04 ప్రజావాణి
మండల కేంద్రంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగె రవి, శిరీష దంపతులు గురువారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘోర కలియుగాన్ని చూసి తట్టుకోలేక బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం మృతుల ఇద్దరు కుమారులు సుశాంత్, విద్యాంశ్ ఒకేసారి తల్లిదండ్రుల చితులకు తలకొరివి పెట్టారు.తండ్రికి పెద్ద కుమారుడు, తల్లికి చిన్న కుమారుడు నిప్పు పెట్టాల్సి రావడం అందరి హృదయాలను కలచివేసింది.కళ్లెదుటే తల్లిదండ్రులు లేక అనాథలైన ఆ చిన్నారుల భవిష్యత్తును తలచుకుని గ్రామమంతా శోకసంద్రమైంది.స్థానికుల అశ్రునయనాల మధ్య దంపతుల అంత్యక్రియలు పూర్తిచేశారు.





