బెజ్జంకి, జూలై 8(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు సర్పంచ్ చిలముల సతీష్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడం, తల్లిదండ్రులను ప్రభుత్వ విద్యా వ్యవస్థ వైపు మరింత ఆకర్షించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు కలిగిన విద్యార్థుల కుటుంబాలకు గ్రామంలో అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.గ్రామాభివృద్ధితో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామ పంచాయతీ కట్టుబడి ఉందని సర్పంచ్ చిలముల సతీష్ అన్నారు.




