📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాజకీయ స్వార్థంతోనే ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లు,డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకున్నాయి

రాజకీయ స్వార్థంతోనే ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లు,డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకున్నాయి

📰 Generate e-Paper Clip

చిత్తూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) చిత్తూరు.ఎన్డీఏ సర్కార్కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే లోక్ సభలో బిల్లులను ప్రవేశపెట్టాయి.నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితేనే మహిళా రిజర్వేషన్కు న్యాయం చేయగలం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు చట్టబద్ధత కల్పించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లుల పై అవగాహన ఉంది కాబట్టే ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు మద్దతు తెలిపారు రాజకీయ స్వార్థంతోనే ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకున్నాయనీ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు.ఎన్డీఏ సర్కార్కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, చట్టబద్ధత కోసం లోక్ సభలో బిల్లులను ప్రవేశపెట్టాయని తెలిపారు.నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితేనే మహిళా రిజర్వేషన్కు న్యాయం చేయగలమని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్,డీలిమిటేషన్ బిల్లులకు చట్టబద్ధత కల్పించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లుల పై అవగాహన ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మద్దతు తెలిపారని తెలియజేశారు.చిత్తూరు ఎంపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం పై ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండించారు.ప్రతిపక్షాలు రాజకీయ కక్షతోనే,స్వార్థ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఈ బిల్లుల పై విపక్షాలకు అవగాహన లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందినపుడు,అందులో ఒక క్లాజ్ను రూపొందించారని గుర్తు చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాక డీ లిమిటేషన్ ప్రాతిపదికన నూతన రిజర్వేషన్ బిల్లు రూపొందించి అమలు చేయడమే క్లాజ్ ఉద్దేశమన్నారు.ఆ మేరకు,డీ లిమిటేషన్ బిల్లుతో పాటు,మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.1971 నుండి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరగ లేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తే,ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలకు మోకాలడ్డుతోందన్నారు.ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి,ప్రత్యామ్నాయం చూపాలని సూచించారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగితేనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి న్యాయం జరుగుతుందని స్పష్టం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ,పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారానే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పారదర్శకంగా అమలు చేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలకు సాధికారత కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లును ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో అడ్డుకున్నాయని,మహిళా సాధికారత క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోదీకి వెళ్తుందనే అసూయతోనే ఇలా వ్యవహరించాయని ఆయన విమర్శించారు.మహిళలకు రాజకీయ సమానత్వం కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఉందని,కానీ ప్రతిపక్షాలు దీనికి రాజకీయ రంగు పులిమి వీగిపోయ్యేటట్లు చేయడం సరికాదని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం తప్పదని ఆయన అధికార పక్షం నేతలు హెచ్చరిస్తున్నారు.ఈ విలేకరుల సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్,మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,చూడ ఛైర్పర్సన్ కఠారి హేమలత,మొదలయార్ సంఘం ప్రతినిధి త్యాగరాజన్ ,టిడిపి సీనియర్ నేతలు సురేంద్ర కుమార్, యాదవ్,కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular