📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaయువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

📰 Generate e-Paper Clip

యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా


ప్రజావాణి శాయంపేట:

యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ శాయంపేట మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి మాట్లాడుతూ విద్యార్థులు, యువత భవిష్యత్తు పట్ల బాధ్యతతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఒక కీలక నిర్ణయమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షలు ముడిపడి ఉన్నాయని, అలాంటి సమయంలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజీనామా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.
విద్యార్థుల సమస్యలు, పరీక్షల నిర్వహణలో ఎదురైన ఇబ్బందులు, విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలను దేశహితం కోరుతూ ఉద్యమం పక్కదారి పట్టకుండా  పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా బాధ్యత వహించడం బీజేపీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని జన్నే మొగిలి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. యువతకు మెరుగైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్న నిర్ణయం బాధ్యతాయుతమైనదని, దేశ యువత ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు చేపడుతుందని జన్నే మొగిలి అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చ జిల్లా నాయకులు లడే శివ సీనియర్ నాయకులు బాసని విద్యాసాగర్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, బూత్ అధ్యక్షులు, కడారి చంద్రమౌళి,బాసాని నవీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular