📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarమున్సిపల్ కార్యాలయంలో ఈపీఎఫ్‌పై అవగాహన సదస్సు

మున్సిపల్ కార్యాలయంలో ఈపీఎఫ్‌పై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కార్యాలయంలో ఈపీఎఫ్‌పై అవగాహన సదస్సు

* కార్మికుడు తప్పనిసరిగా ఈపీఎఫ్ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని

జమ్మికుంటజూలై 27 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులువాటర్ సప్లై సిబ్బంది  కార్యాలయ సిబ్బందికి ఈపీఎఫ్  పై సోమవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారుఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈపీఎఫ్‌లో ఉద్యోగి నుంచి 12 శాతం మున్సిపాలిటీ యాజమాన్యం నుంచి 12 శాతం చొప్పున నిధులు జమ అవుతాయనిస్పష్టంచేశారుఈపీఎఫ్ సభ్యుడు అనుకోకుండా మరణిస్తే నామినీకి రూ. 2.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు బీమా ప్రయోజనం లభించే అవకాశంఉందన్నారుఅంతేకాకుండా అర్హత మేరకు భార్యకు పెన్షన్ పిల్లల విద్యకు సహాయం కూడా అందుతుందని వివరించారుప్రతి కార్మికుడు తప్పనిసరిగా ఈపీఎఫ్ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారుఈ కార్యక్రమంలో సెక్షన్ సూపరింటెండెంట్ మాజేటి రమేష్, సీనియర్ అసిస్టెంట్ జి అనిల్ మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఐ రమేష్‌తో పాటు మున్సిపల్ కార్మికులు వాటర్ సప్లై సిబ్బంది  కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular