మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు: అర్థరాత్రి వేళ దోమల కాటు,ఉక్కపోతతో నరకం
కడప జిల్లా మైదుకూరు జూలై 19 ప్రజావాణి ఆర్టీసీ బస్టాండ్ సమస్యల వలయంగా మారింది.నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోత.దోమల బెడద ప్రస్తుతం ఎండలు,ఉక్కపోత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. ముఖ్యంగా రాత్రి, అర్థరాత్రి సమయాల్లో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్రమైన ఉక్కపోతతో పాటు దోమల బెడదతో నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలు,వృద్ధులు,మహిళలు...