*ముత్తారం క్రికెట్ టోర్నమెంట్ విజేత ఖాణపురం*
*:ద్వితీయ-తృతీయ విజేతలగా ముత్తారం*
*మన ప్రజావాణి మధిర ఆర్ సి మే 4*
*సమ్మర్ సందర్భంగా ముదిగొండ మండలంముత్తారం గ్రామంలో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.పరిసర ప్రాంతాలైన ముదిగొండ,చింతకాని, నెలకొండపల్లి, ఖమ్మం రూరల్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జట్లు పాల్గొని పోటీలను ఉత్సాహభరితంగా మార్చాయి.టోర్నమెంట్ మొత్తం ప్రేక్షకులను అలరిస్తూ ఆసక్తికరంగా సాగింది.ముత్తారం-ఖాణపురం మధ్య వొరహోరి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఖాణపురం జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి విజేతగా నిలిచింది.ముత్తారం లెవెన్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా, ఏ.ఎస్ ముత్తారం జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది.వ్యక్తిగత ప్రతిభలో భాగంగా ఖాణపురం జట్టుకు చెందిన నానబాల హరీష్ ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు.ముత్తారం జట్టుకు చెందిన బంక జానీ ఉత్తమ బౌలర్‌గా నిలిచి ప్రశంసలు అందుకున్నాడు.టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి రూ.15,116ను గ్రామ సర్పంచ్ లంజపల్లి మమత-బుచ్చయ్య అందజేశారు.ద్వితీయ బహుమతి రూ.10,116ను అడపా కొటయ్య, దేవేందర్ జ్ఞాపకార్థం అడపా రాము (అడ్వకేట్ హైదరాబాద్) అందించారు.తృతీయ బహుమతి రూ.5,116ను గోళ్లమూడి వీరకుమారి జ్ఞాపకర్థం,గోళ్లమూడి నాగేశ్వరరావు-బద్రి సంయుక్తంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమత, గ్రామ పెద్దలు, దాతలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటగాళ్లను అభినందించారు.నిర్వాహకులు టోర్నమెంట్ విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.*
ముత్తారం క్రికెట్ టోర్నమెంట్ విజేత ఖాణపురం
ద్వితీయ-తృతీయ విజేతలగా ముత్తారం
RELATED ARTICLES

