📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriబాలాజీ నగర్ నందన్ హిల్స్ కాలనీ నూతన కమిటీ ఏర్పాటు 

బాలాజీ నగర్ నందన్ హిల్స్ కాలనీ నూతన కమిటీ ఏర్పాటు 

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, మే 11(ప్రజావాణి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ నందన్ హిల్స్ కాలనీ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కాలనీ కమిటీని ఏర్పాటు చేశారు. కాలనీ వాసుల సమక్షంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కమిటీలో అధ్యక్షులుగా శ్యామల శ్రీధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా మల్లారెడ్డి, సెక్రటరీగా జనార్దన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా గంధం రాజు, డిప్యూటీ సెక్రటరీగా యాకయ్య, ట్రెజరర్‌గా ఎం.డి. కరీంను నియమించారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వీధి దీపాలు మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తామని తెలిపారు. కాలనీ ప్రజల సహకారంతో సమిష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular