📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం - కాకాణి "

మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం – కాకాణి “

📰 Generate e-Paper Clip

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) సర్వేపల్లి నియోజకవర్గం,పొదలకూరు మండలం,తోడేరు గ్రామంలో కీ”శే” శ్రీ కాకాణి రమణా రెడ్డి  5వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత,మరియు కుటుంబ సభ్యులు,బంధు మిత్రులతో కలిసి కాకాణి రమణా రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి,నివాళులర్పించారు కాకాణి రమణా రెడ్డి,పై ఉన్న మమకారంతో స్థానిక ప్రజలు,ఆత్మీయులు,అభిమానులు,వైఎస్ ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు తరలివచ్చి సమాధి వద్ద నివాళులు అర్పించారు మా తండ్రి కీ.శే.కాకాణి రమణా రెడ్డి ప్రజల మనిషి.ఆయన నిబద్ధత,నిత్యం ప్రజల కోసం ఆలోచించే గుణం మాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి.అధికారం ఉన్నా,లేకపోయినా ప్రజలతో మమేకమై,ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడమే మా తండ్రి దగ్గర మేము నేర్చుకున్న ప్రధానమైన అంశం కష్ట కాలాన్ని అధిగమించడానికి అవసరమైన ఓర్పు నేర్పుతో పాటు,కష్టకాలం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొని తట్టుకొని ముందుకు సాగే గుండె ధైర్యం,మా తండ్రి మాకు ఇచ్చిన వారసత్వం-మా కుటుంబం ఎదుగుదలకు మా తండ్రి పునాది వేశాడు,మేము మా తండ్రి వారసత్వాన్ని కొనసాగించాం మాకు చెప్పుకునేందుకు,ప్రజల్లోకి వెళ్లేందుకు,ప్రజలు మమ్మల్ని గుర్తించేందుకు,మా తండ్రి వారసత్వం మాకు దోహదపడింది మా తండ్రి మాత్రం పూర్తిగా తన జవసత్వాలతో ఎటువంటి వారసత్వం లేకపోయినా రాజకీయంగా ఎదిగి ఏకధాటిగా 18 సంవత్సరాల కాలం పాటు పొదలకూరు సమితి అధ్యక్షులుగా తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శించాడు మా కుటుంబం అన్ని విధాల ఎదుగుదలకు మా తండ్రి కృషి,పట్టుదల,ఔదార్యం,త్యాగం మమ్ములను,మా కుటుంబ సభ్యులందరినీ ఉన్నత స్థాయికి చేర్చగలిగాయి మా తండ్రి భౌతికంగా మా మధ్య లేకపోయినా,ఆయన చూపిన బాటలో,ప్రజా సేవలో ముందుకెళ్లడమే మేము ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిగా భావిస్తాం.మా తండ్రి వర్ధంతి సందర్భంగా తరలివచ్చిన ప్రజలకు,ఆత్మీయులకు,అభిమానులకు నాయకులు,కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular