మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి మంత్రి సీతక్క సూచన

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి .మంత్రి సీతక్క సూచన...సమాజ హితం కోసం అవగాహన కార్యక్రమాలు.   ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)   రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు యువతకు కీలక సూచనలు చేశారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందని, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాల బారిన పడి యువత జీవితాలు నాశనమవుతున్నాయని ఆందోళన తెలిపారు....