📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం: వైద్యాధికారి: వినీత్ కుమార్ రాజు,

మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం: వైద్యాధికారి: వినీత్ కుమార్ రాజు,

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) బి.కోడూరు,ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని,బి.కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బి.కోడూరు,రామసముద్రం పాయలకుంట,పెద్దుల్లపల్లి,మేకవారిపల్లి, ప్రభలవీడు,తంగేడుపల్లి, తుమ్మళ్లపల్లి,మున్నెల్లి ఐతరంపేట,గ్రామ ఆరోగ్య కేంద్రా లయందు భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో,వైద్యాధి కారి,డాక్టర్,యస్,వినీత్ కుమార్ రాజు,సబ్ యూనిట్ అధికారి,టి.నరసింహా రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి,బాషా,ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది,ఆశా వర్కర్లు,అంగన్‌వాడీ కార్యకర్తలు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి, నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపారు.ఈ సందర్భంగా వైద్యాధి కారి,డాక్టర్, వినీత్ కుమార్ రాజు,మాట్లాడుతూ,ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చిన ఇప్పుడు మనం సాధించగలం ఇప్పుడు మనం తప్పక సాధించాలి”అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడమే తమ లక్ష్యమని తెలిపారు. మలేరియా అనేది కేవలం అనారోగ్యం మాత్రమే కాదని,సామాజిక బాధ్యతతో అప్రమత్తతతో పూర్తిగా నిర్మూలించగలిగే వ్యాధి అని ఆయన పేర్కొన్నారు.ఆరోగ్య సిబ్బంది సూచించిన కీలక నివారణా చర్యలు:నీటి నిల్వలు నివారించండి:ఇంటి పరిసరాల్లో,పాత టైర్లు,కొబ్బరి చిప్పలు పగిలిన కుండలు మరియు కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.నిల్వ ఉన్న నీరు దోమల పెరుగుదలకు కేంద్రంగా మారుతుంది.​దోమల నియంత్రణ: నీటి ట్యాంకులు,డబ్బాలపై గట్టి మూతలు ఉంచాలి. డ్రైనేజీ కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
​వ్యక్తిగత రక్షణ రాత్రి పూట తప్పనిసరిగా దోమతెరలు వాడటం,దోమల నివారణ మందులు రాసుకోవడం ఉత్తమం.దుస్తులు సాయంత్రం వేళల్లో శరీరం పూర్తిగా కప్పబడేలా పొడవైన చేతుల దుస్తులు ధరించాలి.
​తక్షణ వైద్యం జ్వరం,వణుకు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి.సమిష్టి కృషితోనే విజయం:
ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషికి ప్రజల సహకారం “ప్రతి శుక్రవారం డ్రై డే తోనే “ఫలితం ఉంటుందని అధికారులు కోరారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను నిర్మూలించడం ద్వారా మలేరియా రహిత, బి. కోడూరు మండలాన్ని నిర్మించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.ముఖ్య గమనిక: మలేరియా నిర్ధారణ రక్త పరీక్షలు మరియు చికిత్స అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా లభించును అని సబ్ యూనిట్ అధికారి టి. నరసింహా రెడ్డి అన్నారు,ఈ కార్యక్రమములో ఆరోగ్య విస్తరణ అధికారి బాషా,ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతు,దోమల నియంత్రణ ప్రజల అందరి భాగస్వామ్యం తోనే నిర్ములన అవుతుంది అని, ప్రజలు అందరూ ముఖ్యంగా ఈ యాండాకాలము జాగ్రత్త గా వుండాలని,పొలము పనులకు పోయినా ఉదయం 10 గంటల లోపలనే ఇంటికి రావాలని,నీరసం రాకుండా,ORS,ద్రావణన్ని,మజ్జిగ,టెంకాయ నీళ్లు, మంచి నీళ్లు,తరుచు గా త్రాగుతూ వుండాలని తెలియచేసారు, ఈ కార్యక్రమం లో,వైద్య సిబ్బంది,ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, రమాదేవి,స్టాఫ్ నర్సస్,ఆశా కార్యకర్తలు,గ్రామప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular