కడపజిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్14)మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,కడప ఉక్కు కోసం అంబేద్కర్ స్పూర్తితో పోరాడి సాధించుకుందాం.DYFI,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు వీరణాల శివకుమార్,వీరణాల.శివనారాయణ.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జమ్మలమడుగు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి DYFI,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వీరణాల శివ నారాయణ లు మాట్లాడుతు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అన్నారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు.అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం నేడు దేశంలో ప్రమాదంలో పడిందని దీనినిపరిరక్షించుకోవటానికి సామాజిక వేత్తలు, ప్రజాతంత్ర వాదులు ఐక్యంగ ముందుకు రావాలని కోరారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు అన్నారు.ముఖ్యంగా రాజ్యాంగంలోని ప్రధాన మౌలిక సూత్రమైన లౌకికవాదం ప్రమాదంలో పడిందని, మతసామరస్యం దెబ్బతింటుందని దళితులు,క్రైస్తవులు ముస్లిం,మైనార్టీల మీద నిరంతరం దాడిజరుగుతుందని అనచివేత ధోరణి కనిపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.మతం పేరుతో ప్రజల్లో చీలిక తెస్తున్నారని హిందూ,క్రిస్టియన్స్. ముస్లిం అంటూ, మతాల కుంపట్లు పెడుతున్నారని వారు దుయ్యబట్టారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మతవైశమ్యలను రెచ్చగోడుతున్నాయని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు ప్రజాప్రతినిధులు నేడు ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిని అడ్డుకోవాలని అప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని వారన్నారు,దేశంలో కులాల మీద మతాల మీద జరుగుతున్న దాడిని తిప్పి కొట్టాలని, కుల నిర్ములనకోసం పాటుపడాలని వారు కోరారు.ముఖ్యంగా కేంద్రం విభజన హామీలు అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు.కడప ఉక్కు కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు.కడప ఉక్కు కోసం,విభజన హామీల అమలు కోసం అంబేద్కర్ స్పూర్తితో పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో DYFI నాయకులు అరుణ్,శశి,సాయి,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నాయకులు నారాయణ,రామకృష్ణ నాయకులు పాములేటి,శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు
Homeఆంధ్రప్రదేశ్మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,
మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,
0
6
RELATED ARTICLES
- Advertisment -



