విజయోత్సవ సంబరాలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గం లోని నలుమూలల నుంచి భారీగా విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు.భారీగా తరలివచ్చిన మహిళలు. రెండేళ్లలో ప్రజలకు కల్పించిన నమ్మకం,చేసిన అభివృద్ధి,అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేలా విజయోత్సవాలు. విజయోత్సవ సంబరాలకు హాజరైన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్,టిడిపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్,బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టిడిపి నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, అధికారులు, ప్రజాప్రతినిధులు. రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించిన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రతిబింబించిన వివిధ శాఖల ప్రత్యేక స్టాళ్లు. నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులకు వివరించిన బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్, ఆయా శాఖల అధికారులు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి,సంక్షేమం రెండు చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా విజయోత్సవ వేడుకలు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్,బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్ బి.కోడూరు మండలం టీడీపీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ,బీజేపీ జిల్లా కార్యదర్శి కేవీ రమణ,ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్,సీమాంక్ హాస్పిటల్ డైరెక్టర్ జహంగీర్ భాష,బద్వేలు నియోజకవర్గం నాయకులు చెరుకూరి రవికుమార్,పామూరి బాలిరెడ్డి,కర్నాటి వెంకట రెడ్డి,బాదిరెడ్డి వీరారెడ్డి,ఇమామ్ హుస్సేన్,కొంకుల రాంబాబు,మాచుపల్లి లక్ష్మి దేవి,చెరుకూరి చెండ్రాయుడు,ఓ.రమణారెడ్డి జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి, సింగం శెట్టి వెంకట సుబ్బయ్య,తదితరులు పాల్గొన్నారు.త్సాహంగా పాల్గొన్న ప్రజలు,అధికారులు, సిబ్బంది.పండుగ వాతావరణాన్ని తలపించిన రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండప ప్రాంగణం
బద్వేల్ రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు
RELATED ARTICLES




