*మండల కేంద్రంలో జనగణన-2027 శిక్షణ కార్యక్రమం*
*చిలుకూరు ఏప్రిల్18 (ప్రజావాణి)*: జనగణన -2027ను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు సమర్ధవంతగా
పూర్తి చేయాలని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు. శనివారం చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జనగణన మండల మొదటి విడత శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చిలుకూరు మండలంలో జనగణన సర్వే చేసేందుకు 71 మంది ఎన్యూమరేటర్లు, 11 మంది సూపర్వైజర్లు నియమించినట్లుగా తెలిపారు. రెండు విడతల్లో జనగణన సర్వే చేసే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుకు శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. నిబందనల మేరకు శిక్షణలో నేర్చుకున్న విధంగా జనగణన సర్వే చేయాలని సూచించారు. ఏలాంటి తప్పులు జరగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం, ఆర్ఐలు మంత్రిప్రగడ సీతరామచందర్రావు. శ్వేత, ఎంపీహెచి ప్రవీణ్, మాస్టర్ ట్రైనర్ చందా శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
*మండల కేంద్రంలో జనగణన-2027 శిక్షణ కార్యక్రమం*
RELATED ARTICLES

