📄 ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialఅంబేద్కర్ రాష్ట్రీయ సమ్మాన్ పురస్కారం అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడుభీమ్ పుత్ర శ్రీనివాస్

అంబేద్కర్ రాష్ట్రీయ సమ్మాన్ పురస్కారం అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడుభీమ్ పుత్ర శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

అంబేద్కర్ రాష్ట్రీయ సమ్మాన్ పురస్కారం అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
భీమ్ పుత్ర శ్రీనివాస్
మందమర్రి, (మన ప్రజావాణి) ఏప్రిల్ 18:

పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎంపిపిఎస్) ఉపాధ్యాయుడు డాక్టర్ భీం పుత్ర శ్రీనివాస్ జలంపల్లి ప్రతిష్టాత్మక గ్లోబల్ ఐకాన్స్ అఫ్ ఇండియా ఈ-మ్యాగజైన్స్ లో చోటు సంపాదించడం తోపాటు, గ్లోబల్ ఐకాన్స్ అఫ్ ఇండియా వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రీయ సమ్మాన్ – 2026 పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఈ మేరకు భీం పుత్ర శ్రీనివాస్ ను అభినందిస్తూ, నిర్వాహకులు అవార్డును అందించడం తోపాటు సర్టిఫికెట్, మెడల్, జ్ఞాపికను శనివారం పోస్టు ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భీం పుత్ర శ్రీనివాస్ కు సంబంధించి తమ మ్యాగజైన్ లో కథనాన్ని సైతం ప్రచురించారు. మండలంలో నివసిస్తున్న డాక్టర్ భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి విద్యా రంగంలో 25 సంవత్సరాలకు పైగా సేవలందించిన అంకితభావం గల, అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడిని కొనియాడారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా వ్యవహరించే విధానానికి ప్రసిద్ధి చెందిన ఆయన, పాఠశాల యూనిఫాంలో విద్యార్థులతో పాటు బోధించడం ద్వారా క్రమశిక్షణను, సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ, యూనిఫాం టీచర్ గా ప్రాచుర్యం పొందారని తెలిపారు. క్షేత్రస్థాయి పని, ఆచరణాత్మక అభ్యాసం, చేస్తూ నేర్చుకోవడం, వంటి వినూత్న బోధనా పద్ధతులలో ఆయనకు నైపుణ్యం కాలదన్నారు. అదే విధంగా భీం పుత్ర శ్రీనివాస్ విద్యా విషయాలకు అతీతంగా, కోవిడ్-19, ఆరోగ్య విద్య, అవయవ, శరీర దానం వంటి సామాజిక అవగాహన కార్యక్రమాలలో సైతం చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. అనేక పురస్కారాలతో సత్కరించబడిన డాక్టర్ భీం పుత్ర శ్రీనివాస్ జలంపెల్లి విలువ ఆధారిత విద్య, సామాజిక బాధ్యత, సంపూర్ణ అభివృద్ధి పట్ల తనకున్న నిబద్ధతతో యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారన్నారు. ఈ సందర్భంగా భీం పుత్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, అందరి ఆశీస్సులతో  అంబేద్కర్ పేరుతో పురస్కారం లభించడం సంతోషంగా ఉందని, తన వెన్నంటి ఉంటూ, ఎల్లప్పుడూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా  గ్లోబల్ ఐకాన్స్ అఫ్ ఇండియా నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఐకాన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రీయ సమ్మాన్ పురస్కారం అందుకున్న భీం పుత్ర శ్రీనివాస్ ను పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular