📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భారత ఎన్నిక సంఘం, న్యూఢిల్లీ మరియు చీఫ్ ఎలెక్షన్ అధికారి,అమరావతి వారి ఆదేశాల అనుసరిచి జిల్లా...

భారత ఎన్నిక సంఘం, న్యూఢిల్లీ మరియు చీఫ్ ఎలెక్షన్ అధికారి,అమరావతి వారి ఆదేశాల అనుసరిచి జిల్లా ఎన్నికల అధికారి

📰 Generate e-Paper Clip

కడప జూన్ 10 ప్రజావాణి వారి ఆదేశాల32 ప్రకారం SIR (ప్రత్యేక ముమ్ముర సవరణ) కార్యక్రమంలో ఎన్నికల నమోదు అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి, బద్వేల్ A.చంద్రమోహన్ గారు ఈరోజు 10.06.2026 తేదీన అందరు బూతు స్థాయి అధికార్లకు మరియు సూపర్వైసర్లకు,మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.SIR (ప్రత్యేక ముమ్ముర సవరణ ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓటర్ల జాబితాను శుద్దీకరణ (ఎటువంటి తప్పులు) లేకుండా చేయుట కొరకు అనగా ఓటర్ల జాబితనందు యున్న చనిపోయిన,రెండు ఓట్లు కల్గి యున్న,శాశ్వతంగా గ్రామం వదలి వెళ్ళిన మరియు వివాహమై వేరే ఊరికి వెళ్ళిన మరియు వలస వెళ్ళిన ఓటర్ల సవరణ కొరకు, ప్రస్తుతం 2025 ఓటర్ల జాబితాను, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయడo, ఇలా మ్యాపింగ్ అయిన వారి ఓటర్లను enumeration form నందు పొందుపరచిన వివరాలతో ప్రతి బూతు స్థాయి అధికారి (BLO) జూన్ 15 నుండి జులై 14 వరకు అనగా 30 రోజులు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్ళి ప్రతీయొక్క ఓటర్ కు 1 కాపీ ని ఇచ్చి declaration form ను తీసుకొనవలెను. మరియు BLO APP నందు Enumeration forms ఎలా fill చేయవలెనో వారి పాత్ర గురించి అవగాహన కల్పించడం జరిగినది. సదరు క్షేత్ర స్థాయి నందు ప్రజా ప్రతినిధులతో నియమించబడిన ప్రతి యొక్క బూతు లెవల్ ఎజెంట్స్ వారు సహకరించవలెను.ఆ సమయం లో ఇంటి నందు ఇంకా కొత్తగా (18 సం.,) వయసు కల్గి యున్న వారిని కూడా నమోదు చేసుకొనుటకు వీలుఅవుతుంది.అలా మ్యాపింగ్ కాని వారి జాబితాను ప్రభుత్వ కార్యాలయముల నందు ప్రచురించి వారు ఏవైన 2 ఆధారాలు చూపించిన యెడల వారిని 22.09.2026 తేదీన చివరి జాబితాను ప్రచురించబడును. చివరగా అర్హత కల్గి యున్న ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటర్ల జాబితా నందు నమోదు కావలెను మరియు ఎటువంటి అనర్హత కల్గియున్న ఓటర్ను ఓటర్ల జాబితా నందు నమోదు కాకుండా చూడవలసిందిగా బూతు స్థాయి అధికారులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు అట్లూరు మరియు బి.కోడూరు మండల తహసిల్దారులైన శ్రీ అజాజ్ అహమ్మద్, శ్రీమతి A.V.రమణమ్మ, ఎన్నికల డిప్యూటీ తహశీల్దర్, బద్వేల్ ప్రసన్న లక్ష్మి మరియు అట్లూరు,బి కోడూరు,శ్రీ అవధూత కాశినాయన మండలాల బూతులు లెవెల్ అధికారులు,సూపర్వైజర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular