
అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) కళ్యాణదుర్గం భర్తను హత్య చేసి ఇంటి ఆవరణం లో పూడ్చిపెట్టిన ఘటన గతంలో జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలో భార్యను పోలీసులు శనివారం అరెస్టు చేయగా,మైనర్ కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల మేరకు.కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామానికి చెందిన బోయ సుకన్యకు 17 ఏళ్ల క్రితం బోయ హనుమంతుతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె అమృత, కుమారుడు సందీప్ ఉన్నారు. కొంతకాలంగా హనుమంతు మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడేవాడు.దీంతో భర్తను హత్య చేయాలని సుకన్య నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.గత ఏడాది నవంబర్ 11న తెల్లవారుజామున ఇంట్లో జరిగిన గొడవలో సుకన్య రోకలిబండతో భర్త తలపై దాడి చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం కుమార్తె అమృత సహాయంతో మృతదేహాన్ని ఇంటి ఆవరణం లో ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.కొన్ని నెలలుగా హనుమంతు కనిపించకపోవడంతో బంధువులు ఆరా తీయగా, కూలి పనులకు వెళ్లి తిరిగి రాలేదని సుకన్య చెబుతూ వచ్చిందని తెలిపారు.అయితే కుటుంబ వివాదాల నేపథ్యంలో అసలు విషయం బయటపడటంతో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా,అది హనుమంతేనని నిర్ధారణ అయింది.ఈ కేసులో సుకన్యను అరెస్టు చేసి, మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ పి. గణేష్,సిబ్బందిని డి.ఎస్.పి రవిబాబు అభినందించారు

