📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అభాగ్యుల అంతిమయాత్రలో పాల్గొంటే నిజమైన ఆధ్యాత్మిక తత్వం బోధపడుతుంది - వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని...

అభాగ్యుల అంతిమయాత్రలో పాల్గొంటే నిజమైన ఆధ్యాత్మిక తత్వం బోధపడుతుంది – వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణా రెడ్డి

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) పోరుమామిళ్ళ  జననం సాధారణంగా ఉన్నా,మరణం మాత్రం పదిమంది కన్నీళ్లు పెట్టుకునేలా ఉండాలి అంటాడు ఒక కవి.పుట్టడానికి ముందు అమ్మ గర్భంలో తొమ్మిది నెలల ప్రయాణం రాజుకైనా,సేవకుడికైనా ఒకేలా ఉంటుంది.కానీ,మరణించాక స్వగృహం నుంచి స్మశానం వరకు సాగే అంతిమయాత్ర మాత్రం ఒక్కొక్కరికి ఒక్కోలా సాగుతుంది.ఈ యాత్రను బట్టి ఆ వ్యక్తి జీవించిన తీరు చెప్పవచ్చు.కొందరు మరణిస్తే భూమికి భారం తగ్గిందంటారు,త్వరగా స్మశానంలో పడేస్తే బాగుంటుందని భావిస్తారు.కొందరు మరణిస్తే ఆత్మీయుల కన్నీటితో పుడమి తడుస్తుంది.స్మశానం కూడా మౌనంగా,గంభీరంగా రోదిస్తుంది.కొందరి మరణం మాత్రం ఏకాంతంగా జరిగిపోతుంది.ఎలాంటి హడావిడి ఉండదు,ఎలాంటి ఉద్వేగం ఉండదు. ఒక్కోసారి వారి దేహం జంతువులు,కీటకాలకు ఆహారంగా మారి అక్కడే మట్టిలో కలిసిపోతుంది.ఇలాంటి వారి జననం అందరి లాగే అమ్మకడుపు నుంచి పవిత్రంగా జరుగుతుంది. కానీ,రకరకాల కారణాల వలన.పరిస్థితుల వలన జనన మరణాల మధ్యలోని జీవితం వీరిని ఒంటరిని చేస్తుంది.సరిగ్గా ఇలాంటి వారి గురించి ఆలోచించాడు వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణా రెడ్డికారణాలు ఏవైనా,వారి జీవన విధానం ఎలా ఉన్నా వారి అంతిమ సంస్కారాలు మరియు అంతిమ యాత్ర మాత్రం గౌరవంగా,సంప్రదాయంగా చేయడమే నిజమైన ఆధ్యాత్మిక తత్వం అని అర్థం చేసుకున్నాడు.గత పదేళ్లుగా వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందకు పైగా ఇలాంటి వారి అంత్యక్రియలు చేస్తూ తాను మాత్రమే కాకుండా తన ఆత్మీయులు అయిన కర్నాటి మద్ది రెడ్డి, కుందారపు గురుమూర్తి ,సుంకె వెంకటేశ్వర్లు, చిన్ని సునీల్ కుమార్,చెముడురి వీరస్వామి గుండె కిరణ్ కుమార్,సిరిగిరి శివ,దాదన రోశిరెడ్డి లచే కూడా చేయిస్తూ అందరూ నిజమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేలా చేస్తున్నాడు.తాము నిర్వహించే వివేకానంద సేవాశ్రమం లోని వృద్ధులతో సహా పోరుమామిళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నిరాశ్రయుల మరణాలు సంభవించినా వీరు అంతిమ సంస్కారాలు తమ ఫౌండేషన్ నిధులతో చేస్తున్నారు.పూజలు,వ్రతాలు,ప్రదక్షిణలు ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మానసిక పరిపక్వత కలుగుతుందని తాను బలంగా విశ్వసిస్తాను అంటున్నాడు పాపిజెన్ని రామక్రిష్ణ రెడ్డి..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular