బెజ్జంకి, జూలై 27 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న స్కావెంజర్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి ఎం. మహతిలక్ష్మి తెలిపారు.జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. అలాగే బెజ్జంకి మండలానికి చెందిన స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, నివాస ధ్రువీకరణ పత్రం తదితర అవసరమైన పత్రాలతో బెజ్జంకి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కార్యాలయంలో జూలై 31లోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.9,750 వేతనం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.




