📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బెజ్జంకి కేజీబీవీలో స్కావెంజర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

బెజ్జంకి కేజీబీవీలో స్కావెంజర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 27 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో స్కావెంజర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బెజ్జంకి మండల విద్యాధికారి ఎం. మహతిలక్ష్మి తెలిపారు.సిద్దిపేట
జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు జూలై 28 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.అలాగే దరఖాస్తుదారులు బెజ్జంకి మండలానికి చెందిన స్థానికులై ఉండాలని తెలుపుతూ,ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, నివాస ధ్రువీకరణ పత్రం తదితర అవసరమైన పత్రాలతో బెజ్జంకి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కార్యాలయంలో జూలై 31లోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు.మరిన్ని వివరాలకు 99514 88251 నంబర్‌లో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular