బెజ్జంకి కేజీబీవీలో స్కావెంజర్ పోస్టు భర్తీ.. మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
బెజ్జంకి, జూలై 27 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న స్కావెంజర్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి ఎం. మహతిలక్ష్మి తెలిపారు.జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. అలాగే బెజ్జంకి మండలానికి...