📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialఎస్టిపిపిలో సింగరేణి డైరెక్టర్ తిరుమల రావు పర్యటన

ఎస్టిపిపిలో సింగరేణి డైరెక్టర్ తిరుమల రావు పర్యటన

📰 Generate e-Paper Clip

జైపూర్, జూలై27,ప్రజావాణి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం. తిరుమల రావు సోమవారం పర్యటించారు. సింగరేణి డైరెక్టర్ కు ప్లాంట్ ఈడి సిహెచ్. చిరంజీవి , జిఎం లు ఎం నరసింహ రావు ,ఎం మదన్ మోహన్ స్వాగతం పలికారు.  డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం. తిరుమల రావు ముందుగా 1× 800 మెగావాట్ల ప్లాంట్ కి సంబంధించిన నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. దీనిలో భాగంగా నిర్మిస్తున్న బాయిలర్ పనులను, ట్రాక్ హపర్ పనులను పరిశీలించారు.

అనంతరం వివిధ విభాగాల విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (ఈ అండ్ఎం) ఎం. తిరుమల రావు మాట్లాడుతూ..

1x 800 మెగావాట్ల ప్లాంట్ కి సంబంధించిన నిర్మాణ పనుల పట్ల, దీనిలో భాగంగా నిర్మిస్తున్న బాయిలర్ పనుల పట్ల, ట్రాక్ హపర్ నిర్మాణ పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో ప్లాంటు అధికారులు, ఉద్యోగులు అందరు సమిష్టిగా, కలిసి పనిచేస్తూ, నిర్ణిత సమయానికి మూడో యూనిట్ పనులను పూర్తీ చేయాలనీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్లాంటు ఈడి సిహెచ్ చిరంజీవి , ఎస్టిపిపి జీఎం ఎం నరసింహ రావు , జీఎం(పిసిఎస్) మదన్ మోహన్ , సిఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి పంతులా , ఎజిఎం (ఈ అండ్ ఎం) సూర్యనారాయణ రాజు , 1×800మెగా వాట్ ప్లాంట్ కోఆర్డినేటర్ ఎం.వి. వేణుగోపాల్ , పర్సనల్ విభాగాధిపతి ఎస్వి రాజేశ్వర్ రావు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular