📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakగోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం

📰 Generate e-Paper Clip

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం
గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో మెదక్‌లో భారీ ర్యాలీ
మెదక్, జూలై 27 (మన ప్రజావాణి ప్రతినిధి):
గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
రామాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు గోమాతకు మద్దతుగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సేకరించిన సుమారు లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో గోమాతకు విశిష్ట స్థానం ఉందని, దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ గోమాతను జాతీయ జంతువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహారాజ్ అనిల్ గోపాల్, సాయిబాబా గౌడ్, శివాజీ, మల్కాజి సత్యనారాయణ, రేవంత్ సింగ్ రాజగోపాల్, పృథ్వీరాజ్‌తో పాటు హిందూ బంధువులు, భజన మండలి సభ్యులు, గోమాత రక్షకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular