📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyబీజేపీ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా డా శ్రీనివాసరెడ్డి పన్యాల

బీజేపీ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా డా శ్రీనివాసరెడ్డి పన్యాల

📰 Generate e-Paper Clip

బీజేపీ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా డా. శ్రీనివాసరెడ్డి పన్యాల

 

అమీన్పూర్, జూలై 12(ప్రజావాణి): భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ సంగారెడ్డి జిల్లా జాయింట్ కన్వీనర్‌గా డా. శ్రీనివాసరెడ్డి పన్యాల నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ఎండోమెంట్ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అన్నవాజ్ఝుల సూర్యప్రకాష్, రాష్ట్ర కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

నియామకం అనంతరం డా. శ్రీనివాసరెడ్డి పన్యాల మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధార్మిక విలువల పరిరక్షణ, దేవాలయాల అభివృద్ధి, ధార్మిక సేవా కార్యక్రమాల నిర్వహణ, ఆలయాల సంరక్షణతో పాటు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

అనంతరం డా. శ్రీనివాసరెడ్డి పన్యాల తన రాజకీయ గురువు, అమీన్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజ్ ముదిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈర్ల రాజ్ ముదిరాజ్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈర్ల రాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఎండోమెంట్ (ధార్మిక) సెల్ హిందూ ధార్మిక విలువల పరిరక్షణ, దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించే కీలక విభాగమని పేర్కొన్నారు. డా. శ్రీనివాసరెడ్డి పన్యాల తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీకి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డా. శ్రీనివాసరెడ్డి పన్యాలకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular