ఘట్కేసర్, జూలై 12: ఘట్కేసర్ సర్కిల్ 7వ డివిజన్ ఘనపురం వాసి శ్రీ వేణు మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నిర్మల తెలంగాణ పిండి వంటకాలు మిఠాయి షాప్ రెండో శాఖను నాగారం 5వ డివిజన్ పరిధిలోని రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. వేణు మాధవ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ షాప్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావడం అభినందనీయమని, తెలంగాణ సంప్రదాయ పిండి వంటకాలు, మిఠాయిలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని వేణు మాధవ్‌కు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీం రేవంతన్న రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇటీకాల కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి మామిండ్ల ముత్యాల్ యాదవ్, నాగారం 5వ డివిజన్ అధ్యక్షులు భూమయ్య యాదవ్, ఘట్కేసర్ 6వ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు నానావత్ రూప్సింగ్ నాయక్, బద్దం గోపాల్‌రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, నాయకులు గోపు మరెడ్డి, వట్టి ఇన్నారెడ్డి, కందకట్ల మాధవ్‌రెడ్డి, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, నానావత్ శివాజీ నాయక్, బద్రి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.



