📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriశ్రీ శివశంకరి గోశాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహణ

శ్రీ శివశంకరి గోశాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూలై 12: ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ శివశంకరి వేద పీఠంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివశంకరి గోశాలను ఆదివారం వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాల నడుమ ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి గోశాలను ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

శ్రీ శివశంకరి వేద పీఠం నిర్వాహకులు కాశి కోటేశ్వర శర్మ వారి కుమారుడు శివ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోమాత సేవ యొక్క ప్రాముఖ్యతను అతిథులు వివరించారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో గోశాలల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ముత్యాల్ యాదవ్, మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, కీసరగుట్ట దేవస్థానం ధర్మకర్త ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కందకట్ల మాధవ్ రెడ్డి, సిద్దగోని నర్సింహా, మేకల సునీల్ కుమార్తో పాటు పలువురు భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular