📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బిజెపి పెట్టిన 131 వ రాజ్యాంగ సవరణ సమాఖ్య వాదం పై దాడి..సిపిఎం కడప జిల్లా...

బిజెపి పెట్టిన 131 వ రాజ్యాంగ సవరణ సమాఖ్య వాదం పై దాడి..సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులను బలహీన పరుస్తున్న డీ-లిమిటేషన్ బిల్లు.మహిళా రిజర్వేషన్ పేరాట డి-లిమిటేషన్ బిల్లు రాజకీయ మాయోపాయం.సచార్,మండల కమిషన్ల సిఫారసులు ఎన్డీఏ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు.33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి.జనగణన జరిగాకే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి.సిపిఎం కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్.కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్,వి.అన్వేష్,జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాసు రెడ్డి,బి.దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్),సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.కేంద్రంలోని బిజెపి ఎన్.డి.ఏ.ప్రభుత్వం నిన్న పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 131వ రాజ్యాంగ సవరణ దేశ సమైక్య వాదం పై దాడి చేసే విధంగా ఉందని విమర్శించారు.రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులను బలహీన పరుస్తున్న డీ-లిమిటేషన్ బిల్లు జనగణన జరిగిన తర్వాతనే పెట్టాలని వారు తెలిపారు.మహిళా రిజర్వేషన్ పేరిట డి లిమిటేషన్ బిల్లు రాజకీయ మయోపాయంగా ప్రవేశపెట్టాలని దీని దేశ ప్రజలందరూ తిప్పి కొట్టాలన్నారు.గతంలో మండల కమిషన్, సచార్ కమిషన్,రంగనాథ కమిషన్ దేశంలోని ప్రజల వాస్తవ స్థితిగతులపై సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఇచ్చారని,వాటిలో ఏ ఒక్క సిఫారసుకూడా పరిగణలోకి కేంద్రలో కొలువుతీరిన బిజెపి, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం లేదని విమర్శించారు.డీ-లిమిటేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 లోనే 106వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. దానిని 2029 లో జరగబోయే 19వ సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయాలని వారు కోరారు.2026 -2027 జనగణన పూర్తయ్యాక నియోజకవర్గం బిల్లు ప్రవేశపెట్టాలని అప్పుడు మాత్రమే అది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుందని వారు తెలిపారు.లేకుంటే దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం చట్టసభల్లో ప్రస్ఫుటిస్తుందని ఇది రాజకీయ సామాజిక న్యాయానికి పూర్తి విరుద్ధమని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్న విధానానికి భిన్నమైనదని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular