బద్వేలు జులై 27ప్రజావాణి నియోజకవర్గం, బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 21,22 వ వార్డుల్లో రెండేళ్ల కూటమి పాలనపై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల భాగంగా నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి,21,22వ టిడిపి ఇన్చార్జ్ మాచపల్లి వెంకట కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి, ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారుదేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, సూపర్ సిక్స్ హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున అందజేస్తున్నామని, గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకాన్ని ఒక్కరికి పరిమితం చేశారని విమర్శించారు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర సహాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 అందిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్లు.ఈ కార్యక్రమంలో బద్వేలు 21,22 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Homeఆంధ్రప్రదేశ్బద్వేలు నియోజకవర్గం, బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 21,22 వ వార్డుల్లో రెండేళ్ల కూటమి పాలనపై అభివృద్ధి...
బద్వేలు నియోజకవర్గం, బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 21,22 వ వార్డుల్లో రెండేళ్ల కూటమి పాలనపై అభివృద్ధి &
0
8




